Advertisementt

న‌వీన్ చంద్ర‌ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?

Fri 01st Mar 2019 03:51 PM
naveen chandra,naveen chandra new film `28°c`,andala rakshasi,hero heroine,naveen `28°c`  న‌వీన్ చంద్ర‌ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?
naveen chandra new film `28°C` న‌వీన్ చంద్ర‌ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?
Advertisement
Ads by CJ

న‌వీన్‌చంద్ర పేరు వింటే వెంట‌నే గుర్తొచ్చే చిత్రం `అందాల రాక్ష‌సి`. విభిన్న‌మైన పాత్ర‌తో తొలి సినిమాతోనే ఆకట్టుకున్న న‌వీన్‌చంద్ర ఆ సినిమా త‌రువాత ఆ స్థాయిలో అల‌రించ‌లేక‌పోతున్నాడు. హీరోగా స‌రైన బ్రేక్ కోసం అత‌ను చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. చివ‌రికి నాని న‌టించిన `నేను లోక‌ల్‌`, ఎన్టీఆర్ న‌టించిన `అర‌వింద స‌మేత‌` చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన న‌వీన్ పాత్ర‌ల ప‌రంగా ప్ర‌యోగాలు చేస్తూనే వున్నాడు. అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని వాడుకుంటూనే వున్నాడు. 

అయినా చెప్పుకోద‌గ్గ హిట్ చిక్క‌డం లేదు. త్వ‌ర‌లో `ఇడియ‌ట్‌` సినిమాలో ర‌వితేజ త‌ర‌హా పాత్ర‌తో `హీరో హీరోయిన్‌` సినిమాలో ఆక‌ట్టుకోవ‌డానికి త‌మిళ్ రాక‌ర్స్ జిందాబాద్ అనే స్లోగ‌న్ ఎత్తుకున్న న‌వీన్ చంద్ర ఈ సినిమా తో పాటు మ‌రో కొత్త త‌ర‌హా సినిమాతో ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌య్యాడు. `28°C` అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి న్యూక‌మ‌ర్ అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. టైటిల్ చూస్తుంటేనే ఇదొక ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా అనిపిస్తోంది. పేరుకు త‌గ్గ‌ట్టే సినిమా కొత్త‌గా వుంటుంద‌ని తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా టాలీవుడ్‌లో త‌న అస్థిత్వం కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న న‌వీన్ చంద్ర `28°C` సినిమాతో హీరోగా త‌న‌దైన ముద్ర వేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఆద్యంతం ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా న‌వీన్ చంద్ర ఆశ‌ల్ని ఎంత వ‌ర‌కు ఫుల్ ఫిల్ చేస్తుందో తెలియాలంటే మ‌రికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

naveen chandra new film `28°C`:

naveen chandra can get success this time

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ